కామారెడ్డి జిల్లా , కామారెడ్డి జాతీయ రహదారిపై నడుస్తున్న కారులో మంటలు చెలరేగిన ఘటన శనివారం తెల్లవారుజామున క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..భువనగిరి నుంచి బడాపహాడ్‌కు ఆరుగురు కుటుంబ సభ్యులు స్కార్పియో వాహనంలో శుక్రవారం రాత్రి బయలుదేరారు. కామారెడ్డి జాతీయ రహదారిలోని క్యాసంపల్లి శివారులోకి రాగానే కారులో నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ కారును పక్కకు నిలిపాడు. పొగలతో పాటు మంటలు కూడా వ్యాపించడంతో కారులో ఉన్నవారంతా బయటకు వచ్చారు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దేవునిపల్లి పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ గమనించకపోతే ఘోర ప్రమాదం సంభవించేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజు తెలిపారు.
నడుస్తున్న కారులో మంటలు..తృటిలో తప్పిన పెను ప్రమాదం
- Advertisement -
- Advertisement -
- Advertisement -