Monday, April 28, 2025

కదులుతున్న కారులో బాలికపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

పాట్నా: కదులుతున్న కారులో బాలికను గన్‌తో బెదిరించి ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ సంఘటన బిహార్‌లోని సహర్షా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సెప్టెంబర్ 14న ఓ బాలికను ముగ్గురు వ్యక్తులు గన్‌తో బెదిరించి కారులో తీసుకెళ్లారు. అనంతరం కదులుతున్న కారులో ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. తనపై సామూహిక అత్యాచారం చేశారని బాలిక సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News