Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు ఇకపై వాహనాల్లో వార్నింగ్ సిస్టమ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కేంద్రం కీలక ముందడుగు వేసింది. రోడ్డుపై వెళుతున్న బాటసారులు, సైకిలిస్టులను వాహనాలు ఢీ కొట్టకుండా సహాయ పడే వ్యవస్థను తీసుకు రావడానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం వెహికల్స్ లో ఇన్ బిల్ట్ ‘మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఓఐఎస్) సిస్టమ్ అమర్చే ప్రతిపాదన తెచ్చింది. ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే వాహనాల తయారీ సంస్థలు ఈ సిస్టమ్ తమ వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. బాటసారులు, సైకిలిస్టులను సమీపం నుంచి వెళుతున్న వాహనంలోని మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఓఐఎస్) గుర్తించి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది. ఎమర్జెనీ అయితే డ్రైవర్ ను హెచ్చరిస్తుంది. ఇలా ఎంఓఐఎస్ ఇచ్చే సిగ్నల్‌ను కొలిషన్ వార్నింగ్ సిగ్నల్ అంటారు.

చీకట్లో, క్లిష్టమైన రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు.. ఆ రూట్ లో వెళుతున్న బాటసారులు, సైకిలిస్టులను ఢీ కొట్టకుండా ఈ సిస్టమ్ గుర్తించి సంకేతాలిస్తుంది.. దీంతో సంబంధిత వాహనం డ్రైవర్ జాగ్రత్త తీసుకోవడం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల కార్లు, కమర్షియల్ వెహికల్స్‌లో ఈ సిస్టమ్ తేవాలని కేంద్ర రహదారుల శాఖ యోచిస్తున్నది. వాహనాల తయారీ కంపెనీలు, ఇతర వర్గాలతో సంప్రదింపుల తర్వాత ఈ వ్యవస్థ ఆచరణలోకి వస్తుందని చెబుతున్నారు. గతేడాది దేశంలో 12 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ప్రతి గంటకు సరాసరి 19 మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News