Sunday, February 23, 2025

బస్వాపూర్ వద్ద ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/కోహెడ: భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిద్దిపేట జిల్లా లోని కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు శుక్రవారం కురిసిన వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం బ్రిడ్జ్ మీద నుండి నీరు ప్రవహిస్తుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు ఈ ప్రవాహం పెరిగి బస్వాపూర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంది. తద్వారా సిద్దిపేట  నుంచి హనుమకొండ రాకపోకలు స్తంభించనున్నాయి. మోయ తుమ్మెద వాగు ప్రవహిస్తున్న తీరును తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మోయతుమ్మెద వాగు ప్రవాహం తిలకించడానికి ప్రజలు బస్వాపూర్ బ్రిడ్జి వద్దకు చేరుకుంటున్నారు.

Moyatummeda vagu flowing at Baswapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News