Monday, December 23, 2024

ఉరేసి ఆనక విచారణతంతు సస్పెన్షన్‌పై కోర్టుకు : అధీర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అందివచ్చిన పలు పద్ధతుల ద్వారా పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే బిజెపి యత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి అధీర్ రంజన్ చౌదరీ విమర్శించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల ముగింపు దశలో చౌదరిని సభ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా చేసేందుకు అనేక అనుచిత రీతులల్లో దురుద్ధేశపూరితంగా వ్యవహరిస్తున్నారని చౌదురీ తెలిపారు. సభ నుంచి తన సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. దీనిపై ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. సస్పెన్షన్ వేటు అధికార పక్షపు తిరోగమన చర్య అని , సస్పెన్షన్‌తో తనను అటూఇటు కాని జుగుప్సాకర పరిస్థితికి నెట్టారని విమర్శించారు. వీరి పద్ధతి ముందు ఉరితీసి తరువాత విచారించే బాపతుగా ఉందన్నారు. తనతో పాటు నలుగురు ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ను ప్రస్తావించగా ఇది కొత్త పరిణామం అయిందన్నారు.

సభలో ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల గొంతు అణచివేసేందుకు అధికార పక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తనకు వర్తించని నిబంధనలను తీసుకువచ్చి తనపై వేటేశారని ఈ ఎంపి చెప్పారు. ఇప్పటికీ తనకు సభాధ్యక్ష స్థానంపై గౌరవం ఉందని, స్పీకర్ ఆదేశాలను తాను ధిక్కరించడం లేదని, అయితే ఇప్పుడు తనకు ఇరకాట పరిస్థితి ఏర్పడినందున కోర్టు నుంచి పరిష్కారం దక్కుతుందా? అనే విషయం పరిశీలిస్తానని చెప్పారు. ఈ దిశలో కూడా ప్రయత్నిస్తానని వివరించారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా అనేది తేల్చుకుంటున్నట్లు, కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందనే భావిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్ సమస్యపై లోక్‌సభలో ప్రధాని స్పందనకు తనతో పాటు పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కోరారని, వినకపోవడంతో దీనిపై పట్టుపట్టారని, మాటల సందర్భంలో తాను మోడీని ఉద్ధేశించి నీరవ్ అని సంబోధించానని, నీరవ్ అంటే నిశ్శబ్ధం అని, ఈ మాటకే తనపై వేటేస్తారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News