Monday, December 16, 2024

ప్రధాని లేకుండా రాజ్యాంగంపై చర్చలా ?: అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

సభలో ప్రధాని మోడీ లేకుండా రాజ్యాంగంపై చర్చలా ? అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 వ ఏడాది లోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఎన్డీయే హయాంలో వేలాది మంది సామాన్యులు దేశం విడిచి వెళ్లిపోయారని అన్నారు. చాలా మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం నియంత పాలన సాగిస్తోందని, ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. ‘మహిళలు పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా పోలీస్‌లు తుపాకీలతో బెదిరించి అడ్డుకున్నారు.

అయినప్పటికీ ప్రాణాలకు తెగించి వారంతా పోలింగ్‌లో పాల్గొన్నారు ’ అని సభకు వివరించారు. దేశ సరిహద్దుల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, పొరుగున ఉన్నచైనా సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడుతున్నా తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని విమర్శించారు. మరోవైపు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి తలసరి ఆదాయంపై ప్రభుత్వం కచ్చితమైన గణాంకాలతో ప్రకటన విడుదల చేయాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. దేశంలో పౌరులంతా సమానమేనని, కానీ, ఇప్పుడు మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము అధికారం లోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతామన్నారు. దీనివల్ల కులాల మధ్య వ్యత్యాసం తగ్గుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News