- Advertisement -
అమరావతి: ఎపి ఆర్థిక వ్యస్థను భ్రష్టు పట్టించారని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. జగన్ పత్రికా సమావేశాలు పెట్టి అడిగితే.. చట్ట సభల్లో జవాబు చెప్పమనడం హాస్యాస్పదంగా ఉందని ఆనం తెలిపారు. వైసిపికి రాజకీయ పార్టీగా కొనసాగే హక్కు లేదని, రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని చెప్పారు. ‘‘అసెంబ్లీ అంటే కనీస గౌరవం లేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘జవాబు చెప్పలేక అసెంబ్లీకి రాకుండా పారిపోయిన, జగన్ ఇంట్లో కూర్చోని ప్రశ్నిస్తే .. మేము జవాబు చెప్పాలా?’’అని మంత్రి రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు.
- Advertisement -