Monday, December 23, 2024

కవితపై బండి ఆ వ్యాఖ్యలు చేయకూడదు: అరవింద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపి అరవింద్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎంఎల్‌సి కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఎంపి అరవింద్ తప్పుపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని అరవింద్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అందరిని సమన్వయం చేయాలని అరవింద్ సూచించారు. ఎంఎల్‌సి కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్ధించను అని అరవింద్ చెప్పారు. బండి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితువుపలికారు. సామేతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని బండికి సూచించారు. కవిత ఇడి ఆఫీసులో ఉంటే తెలంగాణ మంత్రి వర్గం మొత్తం ఢిల్లీలో మకాం వేసిందని, ఇదే చిత్తశుద్ధి ప్రజల అభివృద్ధిపై ఉంటే రాష్ట్రం బాగుపడేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News