- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పతనం మొదలైందనినిజామాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రజల్లో బిఆర్ఎస్ పై అభిమానం పోయిందని, కెసిఆర్ ప్రతిపక్ష నేతగా కూడా రావొద్దు అని కోరుకుంటున్నానని, ఇక కెసిఆర్ శకం ముగిందన్నారు. రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు ఇచ్చాక డిపాజిట్ రాని పరిస్థితి నుంచి నేడు సిఎం అయ్యే స్థాయికి ఎదిగారని, ఈ విషయంలో రేవంత్ రెడ్డి ని అభినందించాలన్నారు. ఇకపై తెలంగాణలో బిజెపి ,కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ లో నిలబడాల్సిన చోట కోరుట్ల లో ఎందుకు నిలబడ్డారని తనని చాలా మంది అడిగారన్నారు. బిజెపి , బిఆర్ఎస్ ఒకటేనని ప్రజలు భావించారని, అందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణమన్నారు.
- Advertisement -