నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఇటీవల కేంద్ర క్యాబినెట్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో నవోదయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన క్రమంలో రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను ఎంపీ, సీఎంకు వివరించారు. అలాగే, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అర్వింద్ సీఎం రేవంత్ రెడ్డి కి వివరిస్తూ.. మాధవ్ నగర్ ఆర్ఓబి 50-50 పద్ధతిలో మంజూరు చేయబడింది. అడివి మామిడిపల్లి ఆర్ఓబి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్ళించిందన్నారు. కాంట్రాక్టర్లుకు కూడా సకాలంలో బిల్లులు అందక తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. దీంతో పనులు పూర్తికావడం కాస్త ఆలస్యం జరిగిందన్నారు. ఇవేగాకుండా.. ఇతర ఆర్వోబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని, కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి, పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని ఎంపీ అరవింద్ కోరారు.
నవోదయాల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వాలని సీఎంను కోరిన ఎంపీ అరవింద్
- Advertisement -
- Advertisement -
- Advertisement -