Thursday, January 23, 2025

టర్మ్ ముగిసింది… ముసలం ముదిరింది

- Advertisement -
- Advertisement -

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్ల పదవీకాలం నిన్నే బండి సంజయ్‌కుమార్ పూర్తిచేసుకున్నారు. మరోసారి ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించి.. కొనసాగిస్తారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీలో నిజామాబాద్ ఎంపి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడి వ్యాఖ్యలను తప్పపట్టారు. రానున్న పది నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగే వీలుండడంతో బిజెపి అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించారు. వరుస కార్యక్రమాలను కార్యాచరణ చేస్తూ… ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై బండి సంజయ్ నిరసన దీక్ష, మహిళలగోస.. బిజెపి భరోసా దీక్షలకు సైతం.. ఎంపి అర్వింద్‌తో పాటు మరికొందరు నేతలు హాజరు కాలేదు.. ఈ క్రమంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తప్పపట్టడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News