- Advertisement -
నిజామాబాద్‌కు ఇంకా చాలా వస్తాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అనంతరం ఎంపి అర్వింద్ మాట్లాడుతూ.. పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి పాదాభివందనాలు తెలిపారు. ఇంతటితో తన హామీ పూర్తి కాలేదని.. నిజామాబాద్ కు ఇంకా చాలా వస్తాయని అన్నారు. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందన్నారు. ఎగుమతులు, స్టోరేజ్, మార్కెటింగ్‌తో పాటు.. అనేక రకాలుగా బోర్డు ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న అర్వింద్ కు పసుపు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -