Monday, December 23, 2024

కుటుంబ సభ్యులతో సిఎం కెసిఆర్‌కు ప్రమాదం: ఎంపి అర్వింద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుటుంబ సభ్యులతో సిఎం కెసిఆర్‌కు ప్రమాదం ఉందని అనుమానం కలుగుతోందని ఎంపి అర్వింద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకుందన్నారు. రాష్ట్రానికి పసుపు బోర్డును ప్రధాని ప్రకటించారని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

పసుపు పంట ఎగుమతులు పెంచేలా కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కెసిఆర్ కాపాడుతున్నాడని ఆరోపించారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ దినేష్ కులాచారి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News