Monday, November 18, 2024

ఎంపి అరవింద్‌కు నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

MP Arvind is being deposed on Pasupu board

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు, పసుపు బోర్డుపై నిలదీస్తూ ప్లకార్డుల ప్రదర్శన
బిజెపి, టిఆర్‌ఎస్ మధ్య ఘర్షణ, తీవ్ర ఉద్రిక్తత

మన తెలంగాణ/ డిచ్‌పల్లి : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్‌లో బిజెపి, టిఆర్‌ఎస్ నేతల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పెద్దఎత్తున తోపులాట జరిగింది. ఇరువర్గాల నేతలు పరసర్పం ప రుషమైన పదజాలంతో తిట్టుకున్నారు. చొక్కాలు పట్టుకుని దాడులు చే సుకునే వరకు వెళ్లారు. ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతున్నట్లే కనిపించింది. అయితే పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. తమ లాఠీలకు స్వల్పంగా పని చెప్పారు. దీంతో పరిస్థితి తిరిగి ప్రశాంత స్థితికి చేరుకుంది. మండలంలోని గన్నారం గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మాణం చేసిన వైకుంఠధా మాన్ని బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌కుమార్ ప్రారంభించారు. అయితే స్థానిక శాసనసభ్యుడు రాకుండానే ప్రారంభోత్సవం చేసేందుకు యత్నిం చారు. దీనిపై నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఆక్షేపించారు. దీనిపై వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే అంశంపై ఎంపితో వాగ్వివాదానికి దిగడంతో టిఆర్ ఎస్, బిజెపి నాయకుల మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఇదే సమయంలో ఎంపిపై టిఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలప్పుడు పసుపు తెస్తానని ఇప్పటివరకు ఎందుకు తేలేదని ని లదీశారు. అప్పట్లో ధర్మపురి రాసిన బాండ్ పేపర్, ప్లకార్డ్ చూపిస్తూ ‘అరవింద్ గో బ్యాక్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇది కాస్త వివాదంగా మారింది. దీంతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నా రు. ఈ సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. రం టిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రొటోకాల్ పటించకుం డా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పసుపుబోర్డు కూడా సాధించలేని ధర్మపురి రాష్ట్రంలో మా త్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పైనా, రాష్ట్ర మంత్రులను నోరుపారుసుకుంటున్న ఆయనకు త్వరలోనే ద్ధ్దిచెబుతామని అలాగే రైతుల సమస్యను తీ ర్చకుండాగ్రామాల్లో పర్యటిస్తే బిజెపి నాయకులను అడ్డుకుంటామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News