Monday, January 20, 2025

నాలుగో సారి సిబిఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డిని మంగళవారం సిబిఐ విచారించింది. సిబిఐ ఎస్‌పి రామ్‌సింగ్ సారథ్యంలో విచారణ కొనసాగింది. వివేకా హత్య కేసులో అవినాష్‌ను సిబిఐ నాలుగో సారి ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. 2019లో కడప జిల్లా పులివెందులలో తన నివాసంలో వైఎస్ వివేకాను హత్య చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్ వైఎస్ వివేకా, జగన్‌కు అవినాష్ రెడ్డి సోదరుడు అవుతారు. జనవరి 28న మొదటి సారి సిబిఐ అధికారుల ఎదుట అవినాష్ రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News