Monday, January 20, 2025

సిబిఐ విచారణలో ఎంపి అవినాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని కోటి సిబిఐ అధికారుల కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ రాక సందర్భంగా సిబిఐ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించనుంది. మరోవైపు సిబిఐ కార్యాలయం దగ్గర అవినాష్ రెడ్డి అనుచరులు హల్‌చల్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఎవరూ ఉండకూడదని పోలీసులు ఆదేశించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వెనుక గేటు ద్వారా అవినాష్ కార్యాలయంలోకి వెళ్ళారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో విచారణ చేయనున్నారు. వివేకా హత్య కేసు గురించి అవినాష్ ను అధికారులు విచారించనున్నారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News