Sunday, December 22, 2024

సిబిఐకి మరోసారి లేఖ రాసిన అవినాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సిబిఐకి లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి ఎంపి తాను సోమవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. తన తల్లి అనారోగ్యంగా ఉన్న కారణంగా సోమవారం విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు.

చికిత్స పొందుతున్న తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాత విచారణకు రావడానికి ఏ ఇబ్బంది లేదన్నారు. కాగా, పలుమార్లు వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన కడప ఎంపి అవినాష్ రెడ్డి ఇటీవల ఈనెల 16, 19న రెండు సార్లు సిబిఐ విచారణకు గైర్హాజరు కావడం విదితమే. మరోసారి తాను విచారణకు హాజరు కాలేనంటూ లేఖ రాయడంతో సిబిఐ ఎలా స్పందిస్తున్నంది ఎపిలో తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News