Saturday, December 21, 2024

సిబిఐ నోటీసులపై స్పందించిన అవినాష్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సిబిఐ నోటీసులపై ఎంపి అవినాష్ రెడ్డి స్పందించారు. సోమవారం మధ్యాహ్నం సిబిఐ నోటీసులు అందుకున్నానని తెలిపారు. ముందే నిర్దేశించుకున్న కార్యక్రమాలు ఉండడంతో సిబిఐ విచారణకు హాజరుకాలేకపోతున్నానని వివరించారు. తదుపరి నోటీసు అందిన వెంటనే సిబిఐ విచారణకు హాజరవుతానన్నారు. పులివెందులలోనే సిబిఐ అధికారులు మకాం వేశారు. అవినాష్ ఇంటికి మరోసారి సిబిఐ అధికారులు రావడంతో టెన్షన్, టెన్షన్ నెలకొంది. ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి నేరుగా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. సోమవారం పులివెందులలో భాస్కర్ రెడ్డి అందుబాటులో లేరు. మాజీ ఎంపి వివేకానంద మర్డర్ కేసులో అవినాష్ కీలక నిందితుడిగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News