Tuesday, April 1, 2025

కర్ణాటక సిఎం సిద్ధరామయ్యతో మాజీ సిఎం తనయుడి భేటీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రోజే మరో కుమారుడు, లోక్‌సభ సభ్యుడు బీవై రాఘవేంద్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తోంది. ఇది కాకతీయమని, సీఎంకు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు కావీరి నివాసానికి రాఘవేంద్ర వెళ్లారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా తన నివాసానికి వచ్చిన యడియూరప్ప తనయుడు ఎంపీ రాఘవేంద్రను ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News