Tuesday, January 21, 2025

బజరంగ్ దళ్ కార్యకర్తలకు బెయిలు!

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రవక్త ముహమ్మద్‌కు వ్యతిరేకంగా అగౌరవ నినాదాలు చేసిన నలుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను గురువారం అరెస్టు చేశారు. వారిని ఆదివారం సెషన్స్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. నటుడు షారూఖ్ ఖాన్ చిత్రం ‘పఠాన్’కు వ్యతిరేకంగా వారు జనవరి 25న సినిమా హాల్ ముందు నినాదాలు చేశారు. వారు ‘ముహమ్మద్ తేరే బాప్ కా నామ్ జై…’ అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేశారు.

ఆ రెచ్చగొట్టే నినాదాలను ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు.అంతేకాక వారు కూడా వీధుల్లోకి వచ్చారు. ప్రవక్త ముహమ్మద్‌ను తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేసినందుకు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ప్రవక్తకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆ నలుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు ఐపిసి సెక్షన్లు 295(ఎ), 153(ఎ), 505, 34 కింద అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News