Sunday, December 22, 2024

టచ్‌లో ఉన్నారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ కు చెందిన 8మంది ఎంఎల్‌ఎలు, 5మంది ఎంపిలు మాతో టచ్‌లో ఉన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని ఇదంతా మాజీ సిఎం కెసిఆర్ ఆడుతున్న నాటకమని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడే కెసిఆర్ ఎన్‌డిఎలో చేరుతామని అడిగితే కూడా చేర్చుకోలేదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి 17 సీట్లు గెలుస్తుందని, దేశ వ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఒక్క టి కూడా గెలిచే ఛాన్స్ లేదని, ఆపార్టీకి ఎంపీ అ భ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారని ఎద్దేవా చే శారు. ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థుల ను కెసిఆర్ బ్రతిమలాడు తు న్నారని, బిఆర్‌ఎస్ అవి నీతిని వ్యతిరేకించి ఎ వరు హరీష్ రావుతో సహా బిజెపిలోకి వస్తామమంటే ఆహ్వానిస్తామని తెలిపారు. బిఆర్‌ఎస్, కాం గ్రెస్‌కు అవగాహన ఒప్పందం ఉందని, అందుకే కుంభ కోణాలు బయట పడుతున్నా కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదన్నారు.

రాష్ట్రంలో బి జెపి ప్ర భుత్వం ఏర్పడి ఉంటే కెటిఆర్, కెసిఆర్ ఇప్పటికే జైలులో ఉండే వాళ్ల న్నారు. గ్రామస్థ్ధాయిలో కాంగ్రెస్‌పై వ్యతి రేకత వచ్చిందని, గత అ సెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కుఓటు వేసినందుకు ప్ర జలు బాధపడుతు న్నార న్నారు.కర్ణాటకలోనేకాదు రాష్ట్రంలో సైతం గ్యారంటీలపేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. కెఎ పాల్ కూడా 17 సీట్లు గెలుస్తాం అనే ధీమాతో ఉన్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు మోడీ ఒక్కవైఫు , రజాకార్లు, ఎంఐఎం, బిఆర్‌ఎస్ ఒక వైపు ఉన్నాయన్నారు. దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బిజెపికి గెలిపిస్తారని , ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీని ప్రజలే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం అయిన ఐదు ఏళ్లు ఉండాలని కోరుకుంటామన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌ను ఇంటికి సాగనంపుతారని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా బిజెపి, బిఆర్‌ఎస్ ఒక గూటి పక్షులేనని అప్పుడు కూడా కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేశారని, ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయడం లేదని ప్రశ్నించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News