మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు అయినా బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీలో హరీశ్ రావు ఒక్కడే ఏకైక మంచి నేత అని కితాబిచ్చారు. కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించి న మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అ నంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావును ఆకాశానికెత్తేశారు. బిఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఒక్కరే మంచి వారని, ఆయనే అసలైన ఉద్యమకారుడని వ్యా ఖ్యానించారు. బిజెపిలోకి వివిధ పార్టీల నుంచి చేరికల గురించి అడిగిన సందర్భంగా హరీశ్‌రావు అయినా బిజెపిలోకి రావాలని అనుకుంటే బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి రావాల్సిందేనని అన్నారు.
మళ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి గెలవాలని తెలిపారు. హరీశ్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అని కొనియాడారు. హరీష్ రావు మంచి ఉద్యమ నాయకుడని, ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉందని పేర్కొన్నారు. ఆయన మళ్లీ పోటీ చే సినా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే నేను ఇ లా అన్నానంటే హరీష్‌రావు తనకు ఫోన్ చేశారనో, లేక బిజెపిలో చేరుతున్నారనో అనుకోవద్దని తెలిపారు. బిజెపిలో బిఆర్‌ఎస్ విలీనం ఒక డ్రామా అని కొట్టిపారేశారు. ఇప్పటికే బిజెపిలోకి వచ్చేందుకు చాలా మంది బిఆర్‌ఎస్ నుంచి ఎదురు చూస్తున్నారని, అయితే తాము ఎవరిని అ డగడం లేదని అన్నారు. ఎవరు వచ్చినా రాజీనామా చేసి మళ్లీ గెలవాల్సిందేనని, అయితే గెలిపించుకునే బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
నిరుద్యోగులకు మద్దతు
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత బండి సంజయ్ తెలంగాణ నిరుద్యోగులకు మద్ధతు పలికారు. గ్రూప్2 పరీక్ష వాయిదా వేయాలన్న డిమాండ్ కు అనుకూలంగా మాట్లాడారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైనా తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అంటే ఇదేనా అంటూ నిలదీశారు. వెం టనే నిరుద్యోగులతో సామరస్యపూర్వకంగా చర్చించి, వారి ఆందోళనను విరమింప చేయాలని రేవంత్ రెడ్డి ప్ర భుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.