Monday, January 20, 2025

ఎంజిఎంలోనే ప్రీతి చనిపోయింది: ఎంపి బండి సంజయ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైద్య విద్యార్ధి ప్రీతి నాయక్ ఎంజిఎం ఆసుపత్రిలోనే చనిపోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రీతి ఘటనకు నిరసనగా ఆదివారం వరంగల్ పోచమ్మ మైదాన్ నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు, పార్టీ కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ‘నిరసన దీక్ష’ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News