Monday, December 23, 2024

ఆ ముగ్గురికి ఫ్రెండ్ షిప్ డే ముందే వచ్చేసింది : బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్ లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పది రోజుల ముందుగానే ఫ్రెండ్ షిప్ డే జరుపుకోవాలని చూస్తున్నాయని బిజెపి ఎంపి బండి సంజయ్ సెటైర్ వేశారు. ఈ మూడు పార్టీలు ఒక్కటే అని ప్రతిపక్షాల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. 2023లో తమ ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం వస్తుందని 2019లోనే ప్రధాని మోడీ అంచనా వేశారని పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడిన ఓ వీడియోను బండి సంజయ్ ట్వీటర్‌లో షేర్ చేశారు.
ఆ పార్టీలు గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ : డికె అరుణ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు
కాంగ్రెస్, బిఅర్‌ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని పార్లమెంట్ సమావేశాల్లో బహిర్గతమైంది బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇరు పార్టీలు వ్యవహరించిన తీరుపై బుధవారం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్, బిఅర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, వారు గతంలో కలిసి పని చేశారు.. ఇప్పుడు పని చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా పని చేస్తారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన బిఅర్‌ఎస్‌కు వేసినా ఒకటేనన్న విషయంపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News