- Advertisement -
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ సందర్శించారు. శనివారం మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా బోనాల పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటున్నా.. ఇటీవల రాలేక పోయాను.. అమ్మవారి ఆదేశం మేరకు ఈరోజు వచ్చి దర్శించుకోవడం మనసుకు సంతృప్తిగా ఉందన్నారు. ఉజ్జయిని అమ్మవారు చాలా శక్తివంతురాలు.. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, కోరిన కోర్కెలు నెరవేర్చాలని అమ్మవారిని ప్రార్దించినట్లు తెలిపారు.
- Advertisement -