Wednesday, January 22, 2025

కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలి: బూర నర్సయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదని మాజీ ఎంపి, బిజెపి నేత బూర నర్సయ్యగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులకు ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్ర ఇచ్చిన గిరి వికాస్ నిధులను 30 శాతం కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉండి ఉంటే తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందేదని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టి కూడా సచివాలయానికి ప్రతిపక్షాలను రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ మద్యం దందా కూడా ఎక్కువగా ఉందన్నారు. అత్యధికంగా మద్యం ద్వారానే రాష్ట్రానికి డబ్బు వస్తోందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పుడు జిఎస్‌టి రాబడి ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రూ.5,600 కోట్లు మాత్రమే జీఎస్టీ మీద ఆదాయం వచ్చిందని, తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పుడు ఎందుకు జీఎస్టీ కలెక్షన్ ఇతర రాష్ట్రాల కంటే తక్కువ వచ్చిందని నిలదీశారు. ఎనిమిదేళ్లలో 5 లక్షల కోట్లు అప్పు తెలంగాణలో ఉందన్నారు. సమావేశంలో బిజెపి వివిధ మోర్చాల ప్రతినిధులు, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News