Thursday, April 10, 2025

కెసిఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారని మేము ఎదురుచూస్తున్నాం:ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తా అని తాము కూడా ఎదురుచూస్తున్నామని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే అన్ని సమస్యలకు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది మీరే కాబట్టి ఆ నిధులను ఏం చేశారో చెప్పాలని భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కెసిఆర్‌ను ప్రజలు తరిమేశారని అయినా వారిలో మార్పురావడం లేదని ఆయన ఆరోపించారు. కెసిఆర్ మాటలకే అంకితమయ్యారని,

ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఎంపి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు గుండు సున్నా వచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ చేసిన తప్పులకు తాము మాటలు పడుతున్నామని, కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరని ఆయన ప్రశ్నించారు. వారు చేసిన కర్మల వల్ల తాము ఢిల్లీకి పోతున్నామని, కారు లోన్ కూడా 12 శాతానికి అప్పు తీసుకోలేదన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిజెపిలో ఉనికి కోసం మాట్లాడుతున్నారన్నారు. ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News