Monday, January 6, 2025

కెటిఆర్ మీరు లెక్కల్లో వీకా?:ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ మీరు గుంటూరులో చదివినప్పుడు లెక్కలు చెప్పలేదా! లేక లెక్కల్లో మీరు వీకా? రూ.1.30 కోట్లను రూ.1,000 కోట్లుగా మార్చి, ఏమార్చి చెప్పే అలవాటు మీ నాన్న అయ్య నుంచి మీరు నేర్చుకున్నారా? లేక మీ బుద్ధే ఇంతేనా? ఇగోకు కేరాఫ్ అడ్రస్ నువ్వు అన్న విషయాన్ని తెలంగాణలో గల్లి పిల్లగాడు కూడా చెబుతారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. టిఎస్ నుంచి టిజి పేరు మార్పులో నీకు ఇగో కనిపించిందని, తెలంగాణ ప్రజలకు మాత్రం సెంటిమెంటే కనిపించిందన్నారు.

జనం టిజి కోరుకుంటే నీ పార్టీ పేరుకు కలిసొస్తుందని దానిని టిఎస్‌గా మార్చిన కక్కుర్తి మీదని ఆయన అన్నారు. ‘దందాల కోసం కాళేశ్వరం, కమీషన్ల కోసం ఫార్ములా -ఈ రేస్, ధరణి పేరుతో భూ దందాలు ఇది కదా మీ చరిత్ర’ అంటూ ఎంపి చామల తీవ్ర విమర్శలతో ట్వీట్ వేశారు. టిఎస్ నుంచి టిజిగా అక్షరం మార్పు కోసం అక్షరాల వెయ్యి కోట్లు ఖర్చా? అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఆరోపణలు చేశారు. కెటిఆర్ ట్వీట్‌కు ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News