Thursday, January 16, 2025

బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యులుగా ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి: బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యులుగా ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి నియామకమయ్యారు. దేశవ్యాప్తంగా 12 ఎయిమ్స్‌కు పాలక మండలి సభ్యులుగా 24 మంది లోక్‌సభ ఎంపిలను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. ఇందులో తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడిగా మహబూబ్ నగర్ ఎంపి ( బిజెపి )పార్లమెంట్ సభ్యురాలు డికె అరుణ, భువనగిరి ఎంపి కాంగ్రెస్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ అధికారికంగా ఒక బుల్‌టెన్ విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News