Saturday, November 2, 2024

గతంలో కెసిఆర్ అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు:ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయొద్దని ఆయన కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. లడ్డూ కల్తీ అనడం వల్ల తిరుమలకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌ను కాపాడటానికి సిఎం రేవంత్‌రెడ్డి తన మాటలను ఆచరణలో పెట్టారన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు హైడ్రా కార్యక్రమాలను తప్పు పట్టడాన్ని ఖండిస్తున్నానన్నారు.

మాజీ సిఎం కెసిఆర్ గతంలో హైడ్రా గురించి మాట్లాడారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కెసిఆర్ గతంలో తెలంగాణలో అక్రమ కట్టడాలు కూల్చారన్నారు. హైదరాబాద్‌లో 28 వేల నాలాలపై ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని, అక్రమ నిర్మాణాలను కూల్చేటప్పుడు ప్రభుత్వానికి మీడియా మద్ధతు చేయాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డి సిఎం అయిన తర్వాత లేక్ సిటీగా ఉన్న నగరాన్ని అదే స్థానంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి ఏడాది భారీ వర్షాలతో హైదరాబాద్ వరదల్లో మునిగిపోతుందన్నారు. హైడ్రా మన భవిష్యత్ అని, వరదలతో హైదరాబాద్ నష్టపోవద్దని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

గతంలో కెసిఆర్ అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు
హరీష్‌రావు, సబితాఇంద్రారెడ్డి అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడుతున్నారని గతంలో కెసిఆర్ అక్రమ నిర్మాణాలను కూలగొట్టాలని ఆయన చెప్పారు. దీనికి హరీష్‌రావు, సబిత ఇంద్రారెడ్డి ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చిత్తశుద్ధితో పని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బిఆర్‌ఎస్ నేతలు బాధితులను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో జరగుతున్న విపత్తుల గురించి బిఆర్‌ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు.

రేవంత్ పదేళ్లు సిఎంగా ఉండొచ్చు, కానీ, తర్వాత ఏదో ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పటికి కూడా హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని సిఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళనను తీసుకువచ్చారని ఆయన గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చైర్మన్‌ను చేశారని ఆయన అన్నారు. మూసీ పరిసర ప్రాంతాల్లోని పేదలకు 15 వేల ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News