Wednesday, January 29, 2025

పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది:ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతూనే ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సులను లెక్కచేయకుండా కేంద్రం ఈ అవార్డులను ప్రకటించిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తాత్సారం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 8 మంది బిజెపి ఎంపిలు, ఇద్దరు కేబినెట్ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడం ఆలోచించాల్సిన విషయమన్నారు.

పది సంవత్సరాల్లో కెసిఆర్ పాలనలో ఉన్న వారికి వైర్యం ఉందేమో, ఇప్పుడు తమ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇస్తున్నా తమ సిఫార్సులను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా బిజెపి వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రానున్న బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజలు కూడా ట్యాక్స్‌లు కడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన ట్యాక్స్‌లు కడుతున్న రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఎనిమిది మంది బిజెపి ఎంపిలు, ఇద్దరు కేబినెట్ మంత్రులపైన ఉందని చామల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News