Thursday, December 12, 2024

హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి వీధి నాటకాలకు తెరలేపారు: ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నాయకులు హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి వీధి నాటకాలకు తెరలేపారని, సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి విజయోత్సవాలు చేస్తుంటే ఓర్వలేకనే డ్రామాలు ఆడుతున్నారని ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వ విజయోత్సవాలను చూపెట్టకుండా వీళ్లు ఆడే వీధి నాటకాలను మీడియా చూపెట్టాలని హరీష్ రావు, కౌశిక్ రెడ్డిలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ లీడర్‌షిప్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికి నాటకాలు ఆడుతున్నారన్నారు.

మీడియాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వాళ్లంతా వాళ్లే పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి గొడవలు సృష్టించి అరెస్టులు చేపించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనివల్ల మీడియా ప్రభుత్వం చేస్తున్న విజయోత్సవాలను కాదని వాళ్లు చేసే వీధి నాటకాలను చూపించాలని తెర లేపారని ఆయన ఆరోపించారు. పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News