Wednesday, January 8, 2025

కెటిఆర్‌కు జైలు భయం పట్టుకుంది:ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ రేసు కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ ఇసూ ్తఇచ్చిన తీర్పు ఆయనకు చెంప పెట్టులాంటిదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీకి, కెటిఆర్‌కు జైలు భయం పట్టుకుందన్నారు. అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకోవడానికి కెటిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెడుతున్నారని హరీష్ రావు, కెటిఆర్ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, వారే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ మమ్మల్ని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటున్నారని ఆయన మండిపడ్డారు.

గతంలో ఇదే మా సిఎం రేవంత్ రెడ్డిపై గత పదేళ్లలో దాదాపు 100 కేసులు పెట్టారని, మరీ అవన్ని రాజకీయ కక్షతోనే పెట్టరా అని ఆది శ్రీనివాస్ నిలదీశారు. కెటిఆర్ సిరిసిల్లకు వస్తే ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేశారని ఆయన గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో తప్పు చేయలేదని భావిస్తే ఏసిబి, ఈడీ ముందు విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకోవడం మానేసి, కోర్టుల చుట్టూ పిటీషన్లు వేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లీంచి కెటిఆర్ తప్పు చేయడమే కాకుండా బుకాయింపులకు దిగడం సిగ్గుచేటన్నారు.

కెటిఆర్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చిల్లర పనులు: ఎంపి చామల
ఇప్పటికైనా కోర్టులను, చట్టాలను కెటిఆర్ గౌరవించాలని ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం హైకోర్టు కూడా కెటిఆర్ గొప్పతనాన్ని గుర్తించి ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టి వేసిందని, ఇప్పటికైనా చట్టం గురించి కెటిఆర్‌కు అర్ధమై ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కెటిఆర్‌పై ఫార్ములా ఈ రేస్ కేసు నమోదైన తర్వాత మేకపోతు గాంభీర్యంతో కెటిఆర్ నన్ను అరెస్టు చేసుకోండి, కావాలంటే జైలుకు వెళ్లడానికైనా సిద్ధం అని కెటిఆర్ తొడలు కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దానిని రాజకీయం చేస్తూ స్టోరీలు చెబుతూ డ్రామాలు ఆడొద్దని కెటిఆర్‌కు ఆయన హితవు పలికారు. కెటిఆర్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చిల్లర పనులని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News