Saturday, January 18, 2025

కెటిఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం:ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని, ఆయన మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం ఖాయమని భువనగిరి కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా చామల స్పందించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌లు ఇస్తుంటే కెటిఆర్‌కు కనిపిస్తలేవా అని చామల మండిపడ్డారు. రైతు భరోసా కింద మీలాగ రాళ్లు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని,

సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తామని చామల స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం ఉండదని ఆయన పేర్కొన్నారు. మీ కుటుంబం అంతా పోయి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన ఫొటోలు ఇంకా ఉన్నాయని ఆ విషయాన్ని మర్చిపోవద్దని ఆయన అన్నారు. ప్రజలకు తప్పుడు ప్రచారాలు కాకుండా వాస్తవాలు చెప్పి, మంచి అపోజిషన్ లీడర్‌గా పేరు తెచ్చుకోవాలని కెటిఆర్‌కు ఆయన సలహా ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News