Wednesday, January 22, 2025

యూపి సిఎం బాటలో ఎంపి సిఎం

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో అనుసరిస్తున్న విధానాలను ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్ అనుసరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్‌లో మైనర్ బాలిక హత్య కేసులో ప్రధాన నిందితుని ఇంటిపైకి ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్ దూసుకెళ్లింది. నిందితుని ఇండిని బుల్డోజర్ సాయంతో పూర్తిగా కూల్చేశారు. బిర్సా పోలీస్ స్టేషన్ పరిధి లోని దామోహ్ మేట్‌లో ఈ సంఘటన జరిగింది. మేట్ గ్రామానికి చెందిన మైనర్ బాలికను నిందితుడు హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని ఒక నర్సరీలో పడేశాడు. దీనికి ముందు ఆ బాలిక అమ్మమ్మ మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఒక బావిలో లభ్యమైంది.

ఈ కేసులో ఆ బాలిక (మృతురాలు) కోర్టులో మే 17న సాక్షం చెప్పాల్సి ఉంది. అయితే ఇంతలోనే ఆమె హత్యకు గురైంది. ఈ సంఘటనలపై గిరిజనాభివృద్ధి మండలి ఆందోళన చేసింది. నిందితులను ఉరితీయాలని , వారి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిందితుని తండ్రి యశ్వంత్‌కు చెందిన ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చి వేశారు. ఆ ఇంటిని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారని తహసీల్దార్ రాజు నామ్‌దేవ్ తెలిపారు. మైనర్ బాలికను వేధించి, హత్య చేయడం వంటి నేరాలకు పాల్పడిన నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News