Thursday, December 26, 2024

టికెట్ ఇవ్వలేదని ఎంపి ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

చెన్నై: పార్లమెంట్ ఎన్నికలలో ఎంపి టికెట్ రాలేదని ఎండిఎంకె నేత, ఈరోడ్ ఎంపి గణేశమూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. మార్చి 24న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. సదరు ఎంపి విషపూరిత ట్యాబెట్లు మింగడంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో డిఎంకె, ఎండిఎంకె కలిసి పోటీ చేయడంతో ఈరోడ్ నియోజకవర్గం నుంచి ఎండిఎంకె నేత గణేశమూర్తి పోటీ చేసి ఎంపిగా గెలిచారు. ఈ లోక్ సభ ఎన్నికలలో పొత్తులో భాగంగా ఈరోడ్ నుంచి డిఎంకె, తిరుచ్చి నుంచి ఎండిఎంకె పోటీ చేస్తున్నాయి. దీంతో గణేశమూర్తి తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News