Thursday, January 23, 2025

ఖాకీ కావరం.. ఒంటరి మహిళపై దౌర్జన్యం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

అర్ధరాత్రి వెళ్తున్న మహిళపై పోలీస్ చిల్లర వేషాలు.. బంధించిన కెమెరా

న్యూస్ డెస్క్: రక్షకుడే భక్షకుడిగా మారిపోయాడు మధ్యప్రదేశ్‌లో. అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళపై మోటారు సైకిల్‌పై వచ్చిన ఒక రక్షక భటుడు అత్యాచార యత్నానికి పాల్పడి కెమెరా కంట చిక్కుకున్నాడు. ఈ దారుణ ఘటన భోపాల్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళ చెయ్యిపట్టుకుని బలవంతంగా ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

ఆమె శరీరాన్ని అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆ రాక్షస పోలీసును తప్పించుకుని పారిపోయింది ఆ మహిళ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలను కాపాడాల్సిన పోలీసే వారిపై అఘాయిత్యానికి పాల్పడితే ఇక మహిళలకు దిక్కవరంటూ నెటిజన్లు మ్రండిపడుతున్నారు. ఆ పోలీసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News