Monday, December 23, 2024

ఎంపి డానిష్ అలీని బహిష్కరించిన బిఎస్‌పి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా బిజెపి ఎంపి రమేశ్ బిధూరి నుంచి మతపరమైన దూషణలు ఎదుర్కొన్న బిఎస్‌పి ఎంపి డానిష్ అలీని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి పేర్కొంది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని మీకు గతంలోనే స్పష్టంగా చెప్పాం.పార్టీ కోసం పని చేయాలన్న షరతుతోనే మీకు అమ్రోహా సీటునుంచి టికెట్ ఇచ్చాం. అయితే ఆ సమయంలో మీరు చేసిన వాగ్దానాలన్నిటినీ మరిచిపోయారు. అందుకే పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అని బిఎస్‌పి జాతీయ కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా పేరిట విడుదల చేసిన ఆ ప్రకటన పేర్కొంది.

అయితే ఎంపి డానిష్ అలీ సస్పెన్షన్‌కు నిర్దిష్ట కారణాలేవీ పార్టీ పేర్కొనలేదు. అయితే ఆయన పార్లమెంటులో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నందుకే పార్టీనుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే కాంగ్రెస్ కూడా ఆయన ఎదుర్కొన్న అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను సమర్థించింది. దీనిపై మాయావతి పార్టీ అనేక సార్లు కాంగ్రెస్ ఆయనను హెచ్చరించింది కూడా. మరో వైపు శుక్రవారం లోక్‌సభనుంచి బహిష్కరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాకు న్యాయం చేయాలని కూడా డానిష్ అలీ డిమాండ్ చేశారు. బాధితురాలిని దోషిగా చూడరాదంటూ రాసి ఉన్న ప్లకార్డును మొడలో వేసుకుని ఆయన నిరసన తెలియజేశారు. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని బిఎస్‌పి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి ఉంటుందని భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News