Sunday, December 22, 2024

‘హైడ్రా’ పై ఎంపీ డికె. అరుణ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన  కట్టడాలను ‘హైడ్రా’ కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ లో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడంపై ఎంపీ డికె. అరుణ నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర, హర్యాన, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ఆ రాష్ట్రాలకు ఫండింగ్ చేసేందుకు కలెక్షన్ల కోసమే సిఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ను తెరపైకి తెచ్చారంటూ ఆరోపించారు.

ఎక్కడ విపక్షాలు హామీలపై ప్రశ్నిస్తాయోనని…వాటిని అమలు చేయలేకే హైడ్రా పేరుతో హడావిడి చేస్తున్నారని అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లో గత ప్రభుత్వాలు నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తే …కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డికె. అరుణ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News