Monday, January 20, 2025

శాంతి భద్రతల వైఫల్యం వల్లే.. లగచర్ల ఘటన: డీకే అరుణ

- Advertisement -
- Advertisement -

శాంతి భద్రతల వైఫల్యం వల్లే వికారాబాద్ జిల్లాలో లగచర్ల ఘటన జరిగిందని బిజెపి ఎంపి డీకే అరుణ అన్నారు. లగచర్ల కంపెనీకి భూసేకరణ కోసం రైతులు నిరాకరించారని ఆమె చెప్పారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టు అయి సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 16 మందితో బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తో కలిసి డీకే అరుణ ములాఖత్ అయ్యారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీ వద్దని గత 8 నెలలుగా రైతులు దీక్షలు చేస్తున్నారని.. కానీ, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి యత్నించారని ఎంపీ ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజావేదికను గ్రామస్థులు బహిష్కరించారని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం లేకుండా కలెక్టర్‌ ఒక్కరే గ్రామానికి వెళ్లారని.. అక్కడికి వచ్చిన కలెక్టర్‌ను గో బ్యాక్‌ అని ప్రజలు నిరసన తెలిపారని చెప్పారు. ఈ క్రమంలోనే ఘటన చోటుచేసుకుందని ఎంపీ డీకే అరుణ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News