- Advertisement -
భువనేశ్వర్: సెకండ్ వేవ్‌లో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తామని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఎంఎల్‌ఎలతో సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో చనిపోయిన వారి లోటును పూడ్చలేనిదని, ఆ బాధలలో ఉన్నవారికి తాము ఇచ్చేసహాయం ఉపశమనం కలిగిస్తోందన్నారు. కరోనా బారిన పడిన వారిని కాపాడాటానికి శాయశక్తుల ప్రయత్నించామని కానీ కుదరలేదన్నారు. అందుకే వారి కుటుంబాలకు లక్ష రూపాయలు సహాయం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని సిఎం తెలిపారు.
- Advertisement -