Wednesday, January 22, 2025

యుపి సిఎం యోగీతో ఎంపి జివిఎల్ భేటీ

- Advertisement -
- Advertisement -

MP GVL meet with UP CM Yogi

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకొని ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ఎంపి జివిఎల్ నరసింహారావు కలిసి అభినందించారు. ఈ ఎన్నికల విజయం చరిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యుపి సిఎం యోగీతో 15 నిముషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై ఇద్దరు చర్చించారు.

దక్షిణ భారత దేశంలోని తెలుగు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో కాశీ, మథుర, ప్రయాగరాజ్, గోరఖ్నాథ్ పుణ్య క్షేత్రాలకు భక్తులు వస్తారని యోగీకి జివిఎల్ తెలిపారు. వారి సౌకర్యార్థం వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎంపి జివిఎల్ చెప్పగా యోగీ చాలా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు త్వరలో రావాలని యోగీని ఎంపి జివిఎల్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News