Monday, January 20, 2025

బుల్లిబాయ్ యాప్ వికృత చేష్టలపై తీవ్ర నిరసనలు

- Advertisement -
- Advertisement -

MP Home Minister Mishra condemned Bully boy app mischief

ఎంపి హోంమంత్రి మిశ్రా ఖండన

భోపాల్ : ప్రముఖ ముస్లిం మహిళల ఫోటోలను యాప్ లోకి అప్‌లోడ్ చేసి వేలానికి పెట్టిన వికృత చేష్టలు ఇటీవల ఆందోళన కలిగిస్తున్నాయి. గత జులైలో సలీడీల్స్ పేరిట యాప్ ఇలాంటి అరాచకానికి పాల్పడగా, ఇప్పుడు బుల్లిబాయ్ యాప్ ఒకటి వెలుగు లోకి రావడంతో భిన్న వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వెలువడుతున్నాయి. దాదాపు 100 మంది ప్రముఖ ముస్లిం మహిళల, మహిళా పాత్రికేయుల ఫోటోలను వారి ట్విటర్ ఖాతాల నుంచి సేకరించి వాటిని బుల్లిబాయ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేలానికి పెట్టడం సంచలనం కలిగిస్తోంది. ఈ వికృత చేష్టను మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సోమవారం తీవ్రంగా ఖండించారు.

భారతీయ సంస్కృతిలో మహిళలకు గౌరవం ఎప్పుడూ ఉంటుందని, ముస్లిం మహిళలు హింసకు గురికాకూడదనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చట్టం అమలు లోకి వచ్చిందని ఆయన సోమవారం పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇంతవరకు దీనిపై ఎలాంటి రాలేదని, వస్తే తప్పనిసరిగా చర్య తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ యాప్ గురించి కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ దీనిపై ఢిల్లీ, ముంబై పోలీసులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తోందని చెప్పారు. మహిళా పాత్రికేయురాలి ఫోటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారన్న ఆరోపణపై గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బుల్లిబాయ్ యాప్‌పై తగిన చర్య తీసుకుని కేసు నమోదు చేయాలని ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News