Wednesday, January 1, 2025

మమతకు ఎంపి జవహర్ సర్కార్ షాక్..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని, రాజకీయాలను పూర్తిగా విడనాడాలని తాను నిశ్చయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి జవహర్ సర్కార్ ఆదివారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలో వెల్లడించారు. ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచారం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నచర్యలు ‘మ రీ స్వల్పం, బాగా ఆలస్యం అయ్యాయి’ అని సర్కార్ తన లేఖలో పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రభుత్వంపై తన ‘భ్రమలు తొలగిపోయాయి’ అని, ఒక వర్గం నేతల అవినీతి, ‘దుందుడుకు ఎత్తుగడల’పట్ల ప్ర భుత్వం ‘ఏమాత్రం పట్లనట్లుగా’ వ్యవహరిస్తున్నట్లున్నదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

డాక్టర్ మరణంపై నిరసనలు అప్పటికప్పుడు వ్యక్తం అయ్యాయని ఐఎఎస్ విశ్రాంత అధికారి స ర్కార్ వ్యాఖ్యానిస్తూ, ప్రభుత్వం చెబుతున్న విషయాలు సరైనవైనప్పటికీ దా నిపూ ‘అటువంటి ఆగ్రహం, పూర్తి అపనమ్మకం’ తాను ఎన్నడూ చూడలేదని తెలియజేశారు. ‘పార్టీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఏమాత్రం పాత్ర లేకుండానే ఎంపిగా చేరడంలో ఏకైక ప్రయోజనం బిజెపి, దాని ప్రధాని నియంతృత్వ, మతతత్వ రాజకీయాలపై పోరాటం కొనసాగించేందుకు అద్భుతమైన వేదికగా భావించాను. ఆ మేరకు నాకు ఒకింత సంతృప్తి ఉంది, పార్లమెంట్‌లో అనేక సార్లు కల్పించుకుని మాట్లాడాను&’ అని ఆయన తన లేఖలో తెలిపారు.

తాను టిఎంసిలో చేరిన సంవత్సరం తరువాత 2022లో విద్యా శాఖ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ ‘బాహాటంగా అవినీతికి పాల్పడిన దాఖలాలు’చూసి దిగ్భ్రాంతి చెందానని సర్కార్ తెలియజేశారు. ‘అవినీతి సమస్యను పార్టీ, ప్ర భు త్వం పరిష్కరించాలని బాహాటంగా ఒక ప్రకటన చేశానే. కానీ పార్టీలో సీనియ ర్ నేతలు తనను అవహేళన చేశారు. అంతకు ఒక ఏడాది ముందు మీరు ‘ముడు పులు’, అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తారని ఆశించినందున నేనే అప్పట్లో రాజీనామా చేయలేదు’ అని సర్కార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News