Wednesday, January 22, 2025

అమెరికాలో ఆ మాట చెప్పి ఇక్కడేమో ఈ చేతలా?: ఎంపి సిబల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై రాజ్యసభ ఎంపి కపిల్ సిబల్ ఆదివారం తీవ్రస్థాయిలో ప్రధాని మోడీ వైఖరిని తప్పుపట్టారు. ప్రధాని మోడీ ఇటీవలే అమెరికా చట్టసభల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య మాతృక అని తెలిపారని , అయితే ఆయన చెప్పిన మాతృత్వ నమూనా ఇదేనా అని సిబల్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో స్వచ్ఛమైన రాజకీయాలు కీలకం. దీనితో ఏ దేశమైనా ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అయితే పార్టీల్లో చీలికలు సృష్టించి సొంతపార్టీని బలోపేతం చేసుకోవడం ఎటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ

అవుతుందో మోడీ జవాబు చెప్పాల్సి ఉందన్నారు. ఇతర ఎన్‌సిపి నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో వాలిపోవడం గురించి సిబల్ మాట్లాడారు. ప్రధాని మోడీ చెప్పే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. గత నెలలో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామిక స్ఫూర్తి పరిణామాత్మక క్రమంలో భారతదేశం కీలకంగా నిలుస్తుందని, భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిదని కొనియాడారు. వారం రోజుల వ్యవధిలోనే మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News