Monday, January 20, 2025

బయ్యారం ఉక్కు ఇవ్వాల్సిందే: ఎంపి కవిత

- Advertisement -
- Advertisement -

MP kavitha comments on Bayyaram steel

 

హైదరాబాద్: విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిన భాద్యత కేంద్రంపై ఉందని ఎంపి కవిత తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్ నుంచి కవిత మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యపడదు అనే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతున్నట్లుగా ఉందని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని స్పష్టం చేశారు. బిజెపి నేతలు తెలంగాణలో తిరిగితే ప్రజలు ఒప్పుకోరని, బయ్యారాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నామన్నారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు- కేంద్రం వైఖరిపై రేపు నిరసన తెలుపుతామని కవిత హెచ్చరించారు. తెలంగాణ హక్కులను బిల్లు కంటే ముందు నుంచే అడుగుతున్నామని, కేంద్రం ఇప్పుడు సిగ్గు- బుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కు రావాల్సిన హక్కులు ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని హెచ్చరించారు.  బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయని గిరిజన యువత ఎదురు చూస్తుందన్నారు. బయ్యారం ఉక్కు ఏర్పడితే మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడె ప్రజల బతుకులు బాగుపడుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడారని, కిషన్ రెడ్డి కేంద్రానికి వంతపాడుతూ తెలంగాణ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేంద్రంలోని అధికారులు బయ్యారంలో పర్యటించి ఉక్కు నాణ్యమైందని చెప్పారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News