Monday, December 23, 2024

సిఎం సహాయనిధి పేదల పాలిట సంజీవని..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మహబూబాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి పేద వర్గాల పాలిట సంజీవనిగా నిలుస్తుందని మహబూబాబాద్ ఎంపీ, జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత అన్నారు. ఆదివారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 68 మంది లబ్దిదారులకు రూ.38.46 లక్షల విలువైన చెక్కులు అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచీగా నిలుస్తుందని చెప్పారు. పేద వర్గాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ అనారోగ్యంతో ఆస్పత్రులో చికిత్స పొందిన ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్దికంగా తోడ్పాటు అందిస్తున్నారని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్దమొత్తంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కలు అందించడం లేదని స్పష్టం చేశారు.

మనసున్న మారాజుగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా నిలుస్తు వస్తున్నారని వారికి సమయం వచ్చినప్పుడు ప్రజలు కూడా తమ ఆశీర్వాదాలను అందిస్తూ బీఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలని కవిత పిలుపునిచ్చారు. ప్రతీ లబ్దిదారుడికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుతో పాటు కేసీఆర్, కవితల ఫోటోలతో కూడిన కప్పును అందించి వారందరికీ భోజనాలు కడుపునిండా పెట్టి పంపడం కవిత క్యాంపు కార్యాలయంలో అనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పరకాల శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ కో. అప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, నల్లాని నవీన్ రావు, బోడ పృథ్వీరాజ్, పొన్నాల యుగంధర్, గుర్రాల సురేష్, కొత్తగూడ పార్టీ అద్యక్షులు వేణు, పంజాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News