- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు హరితోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎంపి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లో గురువారం ఎమ్మెల్సీ కవితతో కలిసి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మొక్కలను నాటారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ట్యాంక్ బండ్ వద్ద గల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు కార్పొరేషన్ చైర్మన్లు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -