Monday, December 23, 2024

ప్రధాని పర్యటన రాజకీయ పార్టీ పర్యటనగా మారింది: ఎంపీ కేకే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాజకీయ పార్టీ పర్యటనగా మారిందని బిఆర్ఎస్ ఎంపి కే. కేశవరావు ఆరోపించారు. ప్రధాని పర్యటనలో ప్రొటోకాల్ పాటించట్లేదని కేకే విమర్శించారు. ప్రధాని పర్యటనకు వస్తే ఎంపిల పేర్ల ఆహ్వాన పత్రికల్లో ఉండేవన్నారు. ప్రధాని మోడీ పర్యటనలో పాత ఆనవాయితీ కనిపించట్లేదని కేకే వెల్లడించారు. ప్రధాని పర్యటన దేశ సమాఖ్య స్ఫూర్తిగా విఘాతం కలింగించేలా ఉందన్నారు. పార్టీ కార్యక్రమానికి, అధికారిక కార్యక్రమానికి తేడా లేకుండా చేశారని స్పష్టం చేశారు. రెండింటినీ కలిపి రాజకీయ కార్యక్రమంగా చేయడం బాధాకరం అన్నారు. ఈ సందర్భంగా ఎంపి కేకే ప్రధాని మోడీ కార్యక్రమంపై నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News