Monday, December 23, 2024

ఎంపి కేశినేని కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంపి కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టిడిపిలో సభ్యుడిని మాత్రమేనని, తనకు పార్టీలో ఎలాంటి పదవులు లేవని, అభివృద్ధి విషయంలో తాను పార్టీలు చూడనని స్పష్టం చేశారు. అందరిని కలుపుకొని ప్రజల కోసం పని చేస్తానని వివరించారు. తనపై ఎవరో ఏదో ప్రచారం చేశారని తాను స్పందించనని, తాను ఏం చేసినా మెచ్చుకునేవాళ్లు, తిట్టుకునేవాళ్లు ఉన్నారని, తన గురించి ఎవరేం అనుకున్నా పట్టించుకోనని నాని చెప్పారు.

Also Read: కమలమా?…. కాంగ్రెస్సా?

ఏ పార్టీ సీటు ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనని తిట్టినోళ్ల ఫొటోలు కూడా తన ఫ్లెక్సీలో ఉన్నాయని, అసలు పార్టీలో ఇన్‌ఛార్జ్‌లంతా గొట్టంగాళ్లే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇన్‌ఛార్జ్‌ల పేరుతో హడావుడి చేసేవాళ్లంతా గొట్టంగాళ్లే అని నాని దుయ్యబట్టారు. బిజెపి-టిడిపి పొత్తుపై స్పందించే స్థాయి తనది కాదని, ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని, చిర్రెత్తితే అప్పుడు ఆలోచన చేస్తానని కేశినేని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News